సినిమాలకు నిలయమైన ప్రసాద్ మల్టీప్లెక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమా వస్తుందంటే.. ఆడియన్స్, నెటిజన్స్, రివ్యూవర్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ వైపే చూస్తారు. అయితే దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప-2’ మూవీని ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రదర్శించలేదు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మధ్య తలెత్తిన వివాదం కారణంగానే పుష్ప-2 మూవీ.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో రిలీజ్ కాలేదు.