పుష్ప-2లో ఓ డైలాగ్పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ‘ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్! ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్’ అని అల్లుఅర్జున్ డైలాగ్ చెబుతాడు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఈ డైలాగ్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డైలాగ్ సినిమాలో అవసరమా? అని చర్చించుకుంటున్నారు. మరి మీరేమంటారు..?