అన్నమయ్య: రాజంపేట భువనగిరి పల్లి ఆర్చి సమీపంలో లారీ – ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని మృతి చెందాడు. బుధవారం ఉదయం కర్ణాటక లారీని, హైదరాబాద్ వెళ్లే బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు కాలు విరిగింది. బస్సు క్లీనర్, మరో నలుగురు గాయపడ్డారు.