NGKL: జిల్లాలోని పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని నాగర్ కర్నూల్ నూతన డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ రిజిస్టర్లను డీఈఓ పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు.