GNTR: పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలపాడు చెరువులో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని గుంటూరు నగరానికి చెందిన ఓ ట్రస్ట్ సభ్యుల సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఆ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.