»Ys Sharmila Arrested At Jantar Mantar And Move To Parliamnet Ps
Jantar Mantar వద్ద YS Sharmila అరెస్ట్, పార్లమెంట్ పీఎస్కు తరలింపు
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) అవినీతి పాలన గురించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ రోజు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దీక్ష చేపట్టారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీ పోలీసులు (delhi police) అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీసు స్టేషన్కు తరలించారు. కేసీఆర్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి షర్మిల నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.
YS Sharmila arrested at jantar mantar and move to parliamnet ps
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) అవినీతి పాలన గురించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దీక్ష చేపట్టారు. కాసేపటి క్రితం ఢిల్లీ పోలీసులు (delhi police) షర్మిలను అరెస్ట్ చేశారు. పోలీసులు, వైఎస్ఆర్ టీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత షర్మిల పార్లమెంట్ పోలీసు స్టేషన్కు తరలించారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్.. మంత్రి కేటీఆర్ డౌన్ డౌన్ అని నినాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని గత కొంతకాలం నుంచి షర్మిల ఆరోపిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కాం అన్నారు. 2జీ, కోల్ గేట్ స్కాం కన్నా ఇదే పెద్ద కుంభకోణం అన్నారు. రూ.1.20లక్షల కోట్ల ప్రజా ధనం కాళేశ్వరంలో పోశారని చెప్పారు. వేలాది కోట్లు కేసీఆర్ (cm kcr) దోచుకున్నారని ఆరోపించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 1.5లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1.20 లక్షల కోట్లలో రూ.లక్ష కోట్లు కేంద్ర సంస్థలే రుణాలు ఇచ్చాయని వివరించారు. పవర్ కార్పొరేషన్ రూ.38 వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూ.30 వేల కోట్లు, పీఎన్ బీ రూ.11 వేల కోట్లు, నాబార్డ్, ఇతర సంస్థలు కలిపి రూ.20 వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఈ సొమ్మంతా దేశ ప్రజలదే.. అందుకే ఇది దేశంలో అతి పెద్ద స్కామ్ అని షర్మిల (YS Sharmila) అన్నారు.
కాళేశ్వరం కోసం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మూడేళ్లకే మునిగిపోయిందని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి కాళేశ్వరం అవినీతిని తెలియజేయాలన్నదే తమ ఉద్దేశం అని చెప్పారు. ప్రాజెక్టులో నిబంధనలను పాటించలేదు. ఈ ప్రాజెక్టుకు పురుడి పోసింది వైఎస్ఆర్ అని ఆమె గుర్తుచేశారు. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుతో ప్రాజెక్టుకు గతంలోనే శ్రీకారం చుట్టారని.. రూ.38 వేల కోట్లతోనే 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని వైఎస్ఆర్ భావించారని తెలిపారు. గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని భావించారని వివరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారని షర్మిల (YS Sharmila) విమర్శించారు. ఎత్తిపోతల అవసరం లేకున్నా పెద్ద పెద్ద మోటార్లతో నీళ్లు తోడారని తెలిపారు.
రూ.1600 కోట్లతో కొనుగోలు చేసిన మోటార్లకు రూ.7 వేల కోట్ల లెక్కచూపారని షర్మిల అన్నారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో మోటార్లకు అయ్యే కరెంట్ బిల్ ఖర్చే ఏడాదికి రూ.3 వేల కోట్లు అని చెప్పారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పి, అర టీఎంసీ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఏడాది కూడా సరిగ్గా నీళ్లు ఎత్తిపోయలేదు.. ఇది బోగస్ ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరం అవినీతిపై ప్రతిపక్షాలు మాట్లాడడం లేదని షర్మిల (YS Sharmila) విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్కు, మెఘాకు అమ్ముడుపోయాయని సంచలన ఆరోపణలు చేశారు.