CTR: చంద్రగిరి హైవేలో ఓ ఇన్నోవా వాహనం ప్రమాదానికి గురైంది. బెంగుళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా వాహన డ్రైవరు నిద్ర మత్తులో డివెడర్ మధ్య ఉన్న సిగ్నల్ బోర్డును ఢీకొట్టాడు.. దీంతో ఆయన ఎగిరి రోడ్డు పైన పడ్డాడు. డ్రైవర్‌కు ఎలాంటి దెబ్బలు తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడం వలన పెనుప్రమాదం తప్పింది.