మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ నిన్న ప్రీ లుక్‌ను విడుదల చేశారు. అందులో రక్తంతో తడిచిన హీరో చెయ్యి కనిపిస్తుంది. దీనిపై ఓ నెటిజెన్ పెట్టిన పోస్ట్‌కు డైరెక్టర్ రిప్లై ఇచ్చాడు. పోస్టర్లో చూపించింది మన బాస్ చిరంజీవి చెయ్యే. బ్రాస్లెట్స్ మాత్రం తనది, నానిది. ఆ చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో అని శ్రీకాంత్ వెల్లడించాడు.