TG: వరంగల్ జిల్లా రంగంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రాజమోహన్‌ను కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. కారులో మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లారు. సీసీ ఫుటేజ్‌లో నిందితుల దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.