ATP: పామిడి పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు నిన్న రాత్రి కరెంట్ షాక్తో మృతి చెందాడు. పట్టణంలోని సంతమార్కెట్ వీధిలో ఓ రేకుల షెడ్డు కింద స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.