WNP: రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25), అక్క పద్మ(31) ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. వీరి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.