TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఐదో రోజు సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారి గజ వాహన సేవలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.