ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్‌ని లక్నో రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, పంత్‌ను లక్నో సారథిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఓ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో పంత్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ అనే నలుగురు లీడర్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. పంత్ వచ్చే 10-12 ఏళ్లు ఉంటాడని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.