NDL: రైలు ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీశ్ అనే యువకుడు సోమవారం బొమ్మల సత్రం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.