AP: ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3 నుంచి కల్పించనున్న దర్శనానికి టీటీడీ అధికారులు రేపు ఉచితంగా టోకెన్లు జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య జారీ చేయనున్నారు.