»Nhai Sanction For Telangana 63 Km Four Lane Road Bellampalli To Gadchiroli
Telangana:కు 63 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డు మంజూరు…రూ.43,000 కోట్ల ప్రాజెక్టు
తెలంగాణ(telangana) రాష్ట్రానికి 63 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిని హైదరాబాద్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో(Hyderabad Raipur expressway) భాగంగా బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి(Bellampalli to Gadchiroli) వరకు రోడ్డు మార్గాన్ని విస్తరించనున్నారు. ఈ సరిహద్దు ప్రాజెక్టు విలువ రూ.43,000 కోట్లు కాగా..2025 ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వానికి ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏమిటంటే రాష్ట్రానికి 63 కిలోమీటర్ల(63 km) నాలుగు లేన్ల రహదారిని(four line road) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రోడ్డు మార్గం బెల్లంపల్లి నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి(Bellampalli to Gadchiroli) వరకు నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 63 కిలోమీటర్ల రహదారి(63 km road) అయిన ఈ సరిహద్దు ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 45,000 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ రోడ్డు మార్గం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలోని అన్నారం నుంచి ఆసిఫాబాద్ జిల్లా వీరవెల్లి మీదుగా తెలంగాణ సరిహద్దులోని(telangana maharashtra Border) మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(Hyderabad Raipur expressway) అని కూడా పిలువబడే ప్రతిపాదిత 568 కిమీ హైదరాబాద్-రాయ్‌పూర్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా దీనిని NHAI ప్రకటించింది. ప్రస్తుతం దీనిలో మూడు రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. 325 కిమీ-దుర్గ్ – గడ్చిరోలి – బెల్లంపల్లి (గ్రీన్‌ఫీల్డ్ సెక్షన్) స్ట్రెచ్, 35 కిమీ-బెల్లంపల్లి -మంచిర్యాల్ (NH-363 బ్రౌన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్) స్ట్రెచ్, 208 కిమీ-మంచిర్యాల్- హైదరాబాద్ (SH-1) బ్రౌన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్ ఉన్నాయి.
అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్ (Hyderabad-Raipur) చేరుకోవడానికి 780 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే(new expressway) వేసిన తర్వాత నేరుగా దూరం దాదాపు 250 కి.మీ(250 km) తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం ఈ ఎక్స్‌ప్రెస్‌వే రాయ్‌పూర్ నుంచి దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, గడ్చిరోలి, గోండ్పిప్రి, ఆదిలాబాద్, మంచిరియల్, రామగుండం, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారి ఉండగా.. ప్రతిపాదిత ఎక్స్ ప్రెస్ వేలో భాగంగా బెల్లంపల్లి(bellampalli) వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది నియంత్రిత గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా వేయబడుతుంది.
ఈ రూట్‌ను వేయడానికి రెండు ప్యాకేజీల్లో టెండర్లు పిలవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. ఈ ఆర్థిక కారిడార్‌ను ఆగస్టు 2025(august 2025) నాటికి పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టు కోసం దాదాపు 1,048 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఆర్థిక కారిడార్ పరిధిలోని ఉత్తర టెర్మినల్ భిలాయ్‌కు దక్షిణంగా ఉన్న దుర్గ్ – రాయ్‌పూర్ – అరంగ్ ఎక్స్‌ప్రెస్‌వే (NH53)లో ఇది భాగంగా ఉంటుంది. అయితే దక్షిణం వైపున కారిడార్ హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR), ఔటర్ రింగ్ రోడ్ (ORR) లకు అనుసంధానించబడి ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.