కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జ్ రూపకల్పనలో పాదాచారుల మార్గం గాజుతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోపురం ఆకారంలో ఉన్న పైలాన్, లైటింగ్ వ్యవస్థ ఉంటుందన్నారు. మరోవైపు చుట్టూ నల్లమల అడవులు, ఎత్తైన కొండలు నడుమ ఈ వంతెన టూరిస్ట్ ప్రాంతంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ నిర్మాణం ద్వారా హైదరాబాద్ తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వెల్లడించారు.