AP: పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందించారు. ఈ కేసులకు తాను భయపడటం లేదని ఓ వీడియో రిలీజ్ చేశారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వర్మపై అభ్యంతరకర పోస్టుల కేసు నమోదైంది. తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానమిస్తానని తెలిపారు. కేసులకు తాను భయపడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. సంవత్సర క్రితం చేసిన ట్వీట్ కారణంగా, వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టడం విచిత్రమని పేర్కొన్నారు.