తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ని కలవనున్నారు. అనంతరం 5 గంటలకు తెలంగాణ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం.