TG: ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జే గ్రూప్ పేరుతో నిర్వాహకులు డబ్బులు కట్టించుకున్నట్లు గుర్తించారు. 200 మంది నుంచి రూ.48 కోట్లు వసూలు చేసిన ఆర్జే గ్రూప్ ఛైర్మన్ భాస్కర్, ఎండీ సుధారాణిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నడుస్తున్నాయంటూ, మార్కెట్ ధరతో పోల్చితే తక్కువ ధరకే ఫ్లాట్లు లభిస్తాయని ప్రచారం చేసినట్లు సమాచారం.