TG: వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఈరోజు మృతి చెందింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందని విమర్శించారు. చిన్నారి శైలజ మరణ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని కవిత వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిందని మండిపడ్డారు.