MNCL: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని SCKS-CITU శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి గట్టు మహేందర్ అన్నారు. సోమవారం కాంటాక్ట్ కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను మారుస్తూ 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చిందన్నారు.