SRCL: ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రిలలో శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకొని, ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసవాల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు.