ప్రకాశం: ఇటీవల కాలంలో కంభం వెలుగు ఆఫీసులో అవినీతి జరుగుతుందని, సమాఖ్య ఎన్నికలు సక్రమంగా జరగట్లేదని సంబంధిత కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పత్రికా ప్రకటనలు ఇస్తున్న కంభంకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఇబ్రహీంకు మూడు సంవత్సరాలుగా సీపీఐలో కనీసం సభ్యత్వం కూడా లేదని గిద్దలూరు సీపీఐ నాయకులు అన్నారు.