TG: ప్రభుత్వం ఈ నెల 28 నుంచి 30 వరకు మహబూబ్ నగర్లోని భూత్పూర్లో నిర్వహిస్తున్న రైతు సదస్సు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే రైతు సభలో వ్యవసాయ శాఖల అనుబంధ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకానున్న రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంపై అధికారులు, ఎమ్మెల్యే చర్చించారు.