AP: రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ, మండలిలో ‘జాతీయ ఈ విధాన్ యాప్- నేవా’ అమలుకు ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ఈ యాప్ను రూపొందించారు. ‘నేవా’తో అసెంబ్లీ కార్యకలాపాలన్నీ కాగిత రహిత విధానంలో అమలు చేసేందుకు సాధ్యం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టగా.. దీని అమలుకు కేంద్రం నిధులు కేటాయించనుంది.