AP: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రాణాళిక రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వారసత్వ ప్రాంతాలను గుర్తించి, కాపాడేలా చర్యలు చేపడతామని అన్నారు. ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.