పరిచయం అక్కర్లేని ఏకైక బ్రాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ సినిమా నుంచే తనదైన స్టైల్ అండ్ మ్యానరిజంతో యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటు వచ్చారు పవన్. ప్రస్తుతం పవన్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంది. సినిమాల పరంగానే కాదు.. రాజకీయంగా కూడా పవర్ బ్రాండ్ ఫైర్ పుట్టిస్తోంది.. అలాంటి ఈ పవర్ ఫుల్ బ్రాండ్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి 26 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా పవర్ స్టార్ సినిమాల గురించి ఓ సారి చూస్తే.. ఫస్ట్ సినిమా ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ 1996 అక్టోబర్ 11న విడుదలైంది. దాంతో ఈ ఏడాది అక్టోబర్ 11తో 26 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకున్నారు పవన్. ఇక తొలి సినిమాతో ఆకట్టుకున్న పవన్.. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. ఇక నాలుగో మూవీ ‘తొలిప్రేమ’ పవన్ కెరియర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.. ఇప్పటికీ ఈ సినిమా బుల్లి తెరపై కనిపిస్తే అతుక్కుపోతుంటారు అభిమానులు.
ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు పవన్. తమ్ముడు, బద్రి, ఖుషీ సినిమాలతో పవర్ స్టార్ ఇమేజ్ అంతకంతకు పెరిగిపోయింది. మధ్యలో జానీ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు పవన్. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వత పలు హిట్ చిత్రాల్లో నటించిన పవన్.. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కానీ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి..వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌తో మాసివ్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ‘వినోదయ సీతమ్’ రీమేక్.. ‘భవదీయుడు భగత్ సింగ్’ లైన్లో ఉన్నాయి. మొత్తంగా 26 ఏళ్ల సినీ కెరియర్లో హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు పవన్.