»Happy International Womens Day 2023 Theme And Significance
Women’s Day: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…ఎప్పటి నుంచి చేస్తున్నారంటే!
మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.
మహిళ..ఓ తల్లి, ఓ సోదరి, ఓ కుమార్తెగా మనందరి జీవితాల్లో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. మహిళ లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం( international women’s day)ను ఐక్యరాస్య సమితి(UNO) నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తుచేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. మహిళా దినోత్సవం ప్రధానంగా మహిళలపై హింస, పక్షపాతం, వివక్ష లేని లింగ సమానత్వం గల ప్రపంచం కోసం పిలుపునిస్తుంది. దీంతోపాటు వివిధ రంగాలలో మహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక ఆర్థిక విజయాలను కూడా గుర్తు చేస్తుంది. ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్న నారీమణులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కసారి ఈ రోజు ప్రాముఖ్యత, చరిత్ర ఎంటో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం (2023) అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ #ఎంబ్రేస్ ఈక్విటీ(EmbraceEquity). ఈక్విటీ అనేది కేవలం కలిగి ఉండటమే కాదు, తప్పనిసరిగా కలిగి ఉండాలి. లింగ సమానత్వంపై దృష్టి సారించి ప్రతి విభాగంలో భాగం కావాలని చెబుతుంది. ఈ ప్రచార థీమ్ లక్ష్యం సమాన అవకాశాలు ఎందుకు సరిపోవు అనే దాని గురించి ప్రపంచం మాట్లాడేలా చేయడం.
మహిళలు మొదటిసారిగా మహిళా(women) ఓటు హక్కు కోసం 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా, ఐరోపాలో ఉద్యమాలు చేశారు. ఆ క్రమంలో అమెరికా న్యూయార్క్ నగరంలో ఫిబ్రవరి 28, 1909న వారి హక్కులను గుర్తించిన సోషలిస్ట్ పార్టీ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఆ తర్వాత 1910లో అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో జర్మన్ ప్రతినిధులు ప్రత్యేక మహిళా దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించారు. మార్చి 19, 1911న, మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లలో మిలియన్ల మంది ప్రజలు జరుపుకున్నారు. వియన్నాలోని రింగ్స్ట్రాస్సేపై మహిళలు కవాతు నిర్వహించారు. ఆ తర్వాత 1917లో సోవియట్ రష్యాలో మహిళలు ఓటుహక్కు పొందిన తర్వాత మార్చి 8న IWDని జాతీయ సెలవుదినం(holiday)గా ప్రకటించారు. ఈ తేదీని కమ్యూనిస్ట్ దేశాలు జరుపుకున్నాయి. ఈ క్రమంలో అనేక నిరసనలు సంఘటనల నేపథ్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని 1977లో ఐక్యరాజ్యసమితి ఆమోదించబడిన తర్వాత ప్రపంచ సెలవుదినంగా మారింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని అమలు చేస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో(telugu states) ప్రభుత్వాలు 2022 నుంచి మహిళా దినోత్సవం(మార్చి8న)ను సెలవు రోజుగా జరుపుతున్నాయి. అంతేకాదు ఈ రోజున కేంద్ర కల్చరల్ శాఖ ఆధ్వర్యంలో ప్రాచీన కట్టడాలను ఫ్రీగా సందర్శించే అవకాశం మహిళలకు కల్పిస్తున్నారు.