పండగలు వచ్చాయంటే చాలు… ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. కాగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో డిస్కౌంట్ సేల్ ప్రకటించింది.
బిగ్ దివాలీ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లకు తెరలేపింది. అక్టోబర్ 11 నుంచి 16వ తేదీ వరకు బిగ్ దివాలి సేల్స్ ప్రారంభం కావడంతో ప్రతి ఒక్క వస్తువు పై భారీ డిస్కౌంట్ లభించనుంది. ముఖ్యంగా కంప్యూటర్లు, కెమెరాలు స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్లో పై ఏకంగా 80% డిస్కౌంట్ లభించనుంది.
ముఖ్యంగా ఈ దీవాలి సేల్స్ లో భాగంగా స్మార్ట్ టీవీ ల పై భారీ డిస్కౌంట్ లభించనున్నట్లు తెలుస్తోంది.4K Ultra HD TVలు రూ.17,249 నుంచే ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచి ప్రారంభం అవుతాయి. అలాగే ఏసీలు పై 55% డిస్కౌంట్ లభించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అధునాతనమైన ఫీచర్లు కలిగినటువంటి స్మార్ట్ టీవీలు కేవలం 7000 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఫ్యాషన్ ప్రోడక్ట్స్ పై ఏకంగా 60 నుంచి 80% డిస్కౌంట్ లభించనుంది.
ఇక ఈ స్పెషల్ సేల్స్ లో భాగంగా ఫుడ్ కిచెన్ ఐటమ్స్ పై దాదాపు 80% డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించారు. ఇకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్, టాయ్స్ కేవలం 99 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ అద్భుతమైన ఆఫర్స్ కేవలం 11 అక్టోబర్ నుంచి 16 అక్టోబర్ వరకు మాత్రమే ఉంటాయి.