మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ ఆదరణ చూసి తట్టుకోలేకనే…ప్రత్యర్థులే ఈ దశ్చర్యకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. పార్టీ ఆఫీసుపై దాడి చేసి దిమ్మలు కూల్చినా …మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అంటూ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బెదిరించాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు.