తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మునుగోడులో కేసీఆర్ దొంగబెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. యాదాద్రి నరసింహ స్వామి గుడిలో తడిసిన బట్టలతో ప్రమాణం చేసేందుకు రెడీనా అంటూ ప్రశ్నించారు. ఈసారి పోటీ కేసీఆర్ అహంకారానికి.. మునుగోడు ప్రజలకేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ చేసిన తప్పులకు వదిలేది లేదని..జైలుకు పంపిస్తామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.