Earthquake: న్యూజిలాండ్‌లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు
ఈ మధ్య కాలంలో టర్కీ(Turkey), సిరియా(Syria)లో వినాశకరమైన భూకంపాలు(Earthquakes) సంభవించిన సంగతి తెలిసిందే. ఆ దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. భూకంపం(Earthquake) ధాటికి న్యూజిలాండ్(New Zealand) భూమి మరోసారి కంపించింది. శనివారం న్యూజిలాండ్(New Zealand)లో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

న్యూజిలాండ్(New Zealand)లోని కెర్మాడెక్ దీవుల కేంద్రంగా భూకంపం(Earthquake) సంభవించినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 252 కిలో మీటర్ల లోతులో భూకంప(Earthquake) కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్రత 500 కిలో మీటర్ల వరకూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
న్యూజిలాండ్(New Zealand)లో సంభవించిన భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు కూడా ఏవీ లేవని తెలిపారు. గత నెలలో కూడా న్యూజిలాండ్ లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. అయితే ఆ భూపంకం(Earthquake) కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లలేదు.