Corona Cases : భారత్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కారణం అదేనా?
మళ్లీ కరోనా కేసులు పెరగడానికి కారణం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అని అంటున్నారు. ప్రజలు ఇప్పుడు మాస్క్ ధరించడం కూడా మానేశారు. రద్దీ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని నిపుణులు చెబుతున్నా కూడా ప్రజలు మాస్క్ లు పెట్టుకోవడం లేదు
Corona Cases : భారత్లో కరోనా కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయా? చాప కింద నీరులా మళ్లీ కరోనా కోరలు చాచుతోందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. ఇలా మూడు వేవ్స్ వచ్చి ఇండియానే కాదు.. ప్రపంచాన్నే అతలాకుతలం చేశాయి. వేల మంది ప్రాణాలు తీశాయి. చాలామందిని ఆర్థికంగా దెబ్బతీశాయి. లక్షాధికారులు కాస్త భిక్షాధికారులు అయ్యారు కోవిడ్ వల్ల. రెండేళ్లు కోవిడ్ తో పోరాడాం. ఇక చాలు. దాని పీడ విరగడ అయింది అనుకుంటున్న సమయంలో మరో వార్త ప్రస్తుతం దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.
మరోసారి చాపకింద నీరులా కోవిడ్ విస్తరిస్తోంది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు మూడు నెలల తర్వాత భారత్ లో ఒకే రోజు 300 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 300 కి పైగా కేసులు నమోదు అవడం అనేది ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడి మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. కేరళలో ఒకరు వైరస్ బారిన పడి మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 5,30,775 కి చేరింది.
Corona Cases : మళ్లీ కేసులు పెరగడానికి కారణం నిర్లక్ష్యమేనా?
మళ్లీ కరోనా కేసులు పెరగడానికి కారణం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అని అంటున్నారు. ప్రజలు ఇప్పుడు మాస్క్ ధరించడం కూడా మానేశారు. రద్దీ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని నిపుణులు చెబుతున్నా కూడా ప్రజలు మాస్క్ లు పెట్టుకోవడం లేదు. రెండు డోసులు వేసుకున్న వాళ్లు అయినా సరే.. బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నా చాలామంది బూస్టర్ డోస్ ను తీసుకోవడం లేదు. కోవిడ్ ముప్పు ఇంకా తొలగలేదని చెబుతున్నా ఎవ్వరూ వినడం లేదు. ఖచ్చితంగా రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలి.. జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే కరోనాను అంతం చేయగలం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా కేసులు పెరుగుతూ పోతుంటాయి. ఇప్పటి వరకు దేశంలో 4.46 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4.41 కోట్ల మంది కోలుకున్నారు.