BPT: చీరాల డీఎస్పి ఎండి మోయిన్ నేతృత్వంలో, వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఉజిలిపేటలో ‘శక్తి టీమ్’ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళలు, విద్యార్థినుల భద్రతే ధ్యేయంగా జరిగిన ఈ సదస్సులో శక్తి టీమ్ ఎస్సై ఏ హరిబాబు మాట్లాడుతూ.. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టడానికి, వారిలో ధైర్యాన్ని నింపడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.