VZM: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బొబ్బిలి పురపాలక సంఘ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి జె.వి.ఎస్.ఎస్. రామమోహనరావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపుతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.