SRPT: కోదాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి స్పోర్ట్స్ షాప్ను బీఆర్ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యాజమాన్యం, అభిమానులు రఘుకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ, షాప్ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, ఆంజనేయులు, రెడ్య నాయక్ పాల్గొన్నారు.