ADB: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కలుషితం అవుతున్న ప్రకృతిని మొక్కలు నాటి కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిది అని పిలుపునిచ్చారు.