AP: మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్‌పై అమరావతి సచివాలయానికి వెళ్లారు. విజయవాడ క్యాంపు ఆఫీస్ నుంచి 20KM సైకిల్ తొక్కుతూ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కొండవీటివాగు లిఫ్ట్ వద్ద అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా దేశం-నా బాధ్యతగా ప్రతిఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలి. కాలుష్యరహిత ప్రయాణం కోసం వారానికి ఒక్కసారైనా సైకిల్ ప్రయాణం చేయాలి’ అని ప్రజలకు సూచించారు.