TG: సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్లను పరిశీలించారు. ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం.. ఆ తర్వాత ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులపై ఏరియల్ రివ్యూ నిర్వహించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు ఉన్నారు.