ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల పల్లెపాలెంకు చెందిన పిన్ని వెంకటేశ్వర్లు చేపలవేటకువెళ్లి నీటిలోమునిగి మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా నీటిలో పడి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వలచుట్టుకుని నీటిలో పడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.