AKP: పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని కోటవురట్ల జడ్పీటీసీ ఎస్.ఉమాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక కేజీబీవీలో ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ తిరుమలబాబు, ఏపీవో నాగరాజుతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కలు దోహదపడతాయన్నారు.