నెల్లూరు: మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సచివాలయంలో అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. సమగ్ర బ్లూప్రింట్ సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పించాలని ఆదేశించారు. ఆరు జిల్లాల్లో ఘాట్లు ఏర్పాటు చేస్తామన్నారు.