SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం వెనుక గల అపార్ట్మెంట్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.