BPT: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వైసీపీ శ్రేణులు గురువారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీల కరపత్రాలను నిరసనకారులు బహిరంగంగా దహనం చేశారు.