నాగర్ కర్నూల్: కొల్లాపూర్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకుడు సుధాకర్ రావు 12 డిమాండ్లు సమర్పించారు. మాదాసి కురువలకు ఎస్సీ ధ్రువీకరణ, వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా, సాగునీటి పథకాలు, ముంపు బాధితులకు ఉద్యోగాలు, రైతులకు నష్టపరిహారం, రోడ్ల మరమ్మతులు, పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.