SKLM: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రానికి హిరమండలం (M) గొట్ట గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం విశేషమని కొనియాడుతున్నారు.