WGL: మైనర్ బాలబాలికలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని CP సన్ ప్రీత్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే COTPA-2003, జువెనైల్ జస్టిస్(JJ) చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు.