TG: రాష్ట్రంలో పొత్తులపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎంతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మారే రాజకీయ పరిస్థితులను బట్టి తాము పొత్తులపై ముందడుగు వేస్తామని తెలిపారు. జనసేనతో పొత్తు వ్యవహారాన్ని పూర్తిగా బీజేపీ హైకమాండ్ పెద్దలే నిర్ణయిస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.