E.G: కొవ్వూరులోని గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదివి పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు గురువారం అభినందించారు. 500కు పైగా మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.